వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని మంత్రి ఆర్కేకే రోజా (Minister RK Roja) అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan)సిగ్గూఎగ్గూ లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి రోజా మండిపడ్డారు. మహిళలు, వాలంటీర్లు (Volunteers) అంటే పవన్ కు ఏమాత్రం గౌరవం లేదని అన్నారు. మూడు రోజులుగా పవన్ అడ్డూ అదుపు లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడవాళ్లను అక్రమ రవాణా చేస్తున్నారంటూ పవన్ కల్యాణ్ దుర్మార్గంగా మాట్లాడారని అన్నారు.
పక్క రాష్ట్రాల్లో కూడా వాలంటీర్ వ్యవస్థను మెచ్చుకుంటునన్నారని, అది నచ్చక చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) తన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ తో వాలంటీర్ వ్యవస్థపై మాట్లాడిస్తున్నారని అన్నారు. సీఎం జగన్(CM JAGAN) అంటే పవన్‌కు వణుకు అని అనుకున్నమని కాని వాలంటీర్లు చూసి పవన్ వణికి పోతున్నారని మంత్రి రోజా ఆరోపించారు. వాలంటీర్ల కాళ్లు పట్టుకొని పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్యాకేజీల కోసం తన అమ్మను, పార్టీ కార్యకర్తలను తిట్టిన బాలకృష్ణ(Balakrishna)కు పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూ ఇచ్చారని అన్నారు. రాష్ట్రంలో ఎవరూ సంతోషంగా ఉండొద్దనే పవన్ కంకణం కట్టుకున్నారని చెప్పారు. వాలంటీర్ వ్యవస్థ సీఎం జగన్ తీసుకొచ్చిన విప్లవం అని రోజా కొనియాడారు. మిస్సింగ్, అక్రమణ రవాణకు తేడా తెలియదని ఆమె అన్నారు