NLG: మిర్యాలగూడ మండలం తడకమళ్లకు చెందిన అనంతుల లింగయ్య పొలానికి వెళ్లే సమయంలో పాలేరు వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు. ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతకగా వాగులో మృతదేహం లభ్యమైంది. మృతుని కుమారుడు సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై లక్ష్మయ్య తెలిపారు.