వరంగల్ (Warangal) పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ (PM Modi) ప్రత్యేకంగా ఓ వ్యక్తిని కలుసుకున్నాడు. ఆటిజం(Autism)తో బాధపడుతున్న ఆ వ్యక్తి పేరు కామిశెట్టి వెంకట్ (Kamisetty Venkat). ప్రధాని మోదీ ఈ యువకుడ్ని కలుసుకోవడంతో అసలు ఆ యువకుడు ఎవరంటూ అందరూ సోషల్ మీడియాలో వివరాలు తెలుసుకుంటున్నారు. ప్రధాని మోదీయే స్వయంగా ఆ యువకుడిని పవర్‌హౌస్ లాంటి వాడని అభివర్ణించడం విశేషం.
నరేంద్ర మోదీ చేసిన ట్వీట్:
అసాధారణమైన కామిశెట్టి వెంకట్ ప్రతిభకు, యువశక్తికి ఒక పవర్‌హౌస్. ఆటిజం అతనిని అడ్డుకోలేకపోయింది, పాడటాన్ని కొనసాగించాడు. నాటు నాటు పాట పాడడంతో పాటు ఆ పాటకు నృత్యం కూడా చేశాడు. ఆయన మనోధైర్యాన్ని నేను అభినందిస్తున్నాను. pic.twitter.com/1UkqrTTwA9
వైకల్యం అతడ్ని ఆపలేకపోయిందని, వెంకట్‌ను హత్తుకుని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. ఆ యువకుడి పాట, నృత్యం చూసి వెన్నుతట్టి ప్రోత్సహించారు. కామిశెట్టి వెంకట్(Kamisetty Venkat) పవర్ హౌస్ లాంటి వాడని, అతనిలో నైపుణ్యం ఉందని, అద్భుతంగా పాడాలనే కోరికను అతని ఆటిజం ఆపలేకపోయిందని ప్రధాని మోదీ అన్నారు.
కామెశెట్టి వెంకట్(Kamisetty Venkat) ‘నాటు నాటు పాట’ పాడుతూ డ్యాన్స్ వేయడంతో ప్రధాని మోదీ (PM Modi) సెల్యూట్ చేశాడు. ఈ విషయాన్ని తెలుపుతూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ప్రధాని పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆటిజం బాధితుడికి ప్రధాని మోదీ అండగా నిలవడం గొప్పవిషయమని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.