తెలంగాణ(Telangana) సీఎం కేసీఆర్(Cm KCR) మహంకాళి అమ్మవారిని(Mahankali Temple) దర్శించుకున్నారు. ఆదివారం సికింద్రాబాద్ లోని మహంకాళి అమ్మవారిని ఆయన సతీమణి శోభతో కలిసి దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్(Cm KCR) దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మహంకాళి అమ్మవారికి సీఎం కేసీఆర్ దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
డిప్యూటీ స్పీకర్ పద్మారావు(Padmarao) నివాసంలోని ముత్యాలమ్మ గుడిలో సీఎం కేసీఆర్(Cm KCR) దంపతులు ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం పద్మారావు కుటుంబీకులతో కలిసి ఫోటో సెషన్లో పాల్గొన్నారు. వీరికి ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha) కూడా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని(Mahankali Temple) దర్శించుకున్నారు. అమ్మవారికి బంగారు బోనం సమర్పించి పూజలు చేశారు.