NLG: నల్గొండ సెట్విన్ కేంద్రంలో కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మైనార్టీ మహిళలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివారం సర్టిఫికెట్లు, కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. సెట్విన్ను రాష్ట్రంలోనే ఉత్తమ కేంద్రంగా తీర్చిదిద్దుతామని, మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ చైతన్య, కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.