పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్చి 19న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేడుక ఖరారైంది. మార్చి 15న హైదరాబాద్‌లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో సాయంత్రం 5 గంటల నుంచి ఈ ఈవెంట్ స్టార్ట్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పోస్ట్ పెట్టారు.