GNTR: మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరిగే SSC పరీక్షల కోసం గుంటూరు జిల్లాలో 149 కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. విద్యార్థులు ఉదయం 9 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలు ఉండగా, మొబైల్ ఫోన్లు సహా ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధమని చెప్పారు.