GDWL: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల వేతనాన్ని రూ.18,000కు పెంచాలని కోరుతూ అలంపూర్ ఎమ్మెల్యే విజయుడుకు వినతిపత్రం అందజేశారు. ఐసీడీఎస్‌కు నిధులు కేటాయించాలని, ప్రీ-ప్రైమరీ విద్యను అంగన్వాడీల్లోనే కొనసాగించాలని కోరారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.