CTR: నగరి రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులతో నగరి ఆర్డీవో అనుపమ శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. వినియోగదారులు గ్యాస్ కొరతపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని కోరారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గృహ వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ల పంపిణీలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.