శ్రీకాకుళంలో హోటల్, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాల యజమానులు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో సిలిండర్లు అందకపోవడంతో కట్టెల పొయ్యిలపై వంట చేస్తున్నామని వ్యాపారులు తెలిపారు. ఈ సమస్య వల్ల వ్యాపారం దెబ్బతింటోందని పేర్కొన్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి త్వరితగతిన సిలిండర్ల సరఫరా పునరుద్ధరించాలని కోరుతున్నారు.