CTR: పులిచెర్ల మండలం కల్లూరు, మంగలం పేటలోని పదవ తరగతి పరీక్ష కేంద్రాలను శుక్రవారం ఎంఈవోలు సిద్ధరామయ్య, పోకల తాతయ్య తనిఖీ చేశారు. కల్లూరు పరీక్ష కేంద్రంలో 219 మంది, మంగళంపేట పరీక్ష కేంద్రంలో 90 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, గాలి, వెలుతురు, విద్యుత్ సరఫరా, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలను పరిశీలించారు.