MDK: ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ. 18 వేల రూపాయలు అమలు చేయాలని సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు కడారి నాగరాజు డిమాండ్ చేశారు. నర్సాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆశ వర్కర్ల సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఆశ వర్కర్లకు 18000 కనీస వేతనం అమలు చేసే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరారు.