అన్నమయ్య: జిల్లా ఎస్పీ ధీరజ్ రైతులకు హెచ్చరిక జారీ చేశారు. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధుల జమ నేపథ్యంలో సైబర్ నేరగాళ్ల నుంచి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాట్సాప్, ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని, ఓటీపీ, బ్యాంక్ వివరాలు ఎవరికీ చెప్పవద్దని తెలిపారు. మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని కోరారు.