WG: వాల్మీకి రామాయణాన్ని తెలుగులో అనువదించిన రచయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకల్లో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. తణుకు సొసైటీ రోడ్డులో మొల్లమాంబ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అధికారికంగా జయంతి ఉత్సవాలను నిర్వహించడం పట్ల ఆయన హర్షం తెలిపారు. శాలివాహన కుటుంబం నుంచి వచ్చిన ఆమె ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు.