»Violence Continues In Manipur Three Killed In Thug Attack
Manipur లో ఆగని చిచ్చు… దుండగుల దాడిలో ముగ్గరి మృతి
మణిపూర్ లో అల్లర్లు రోజురోజుకు హింసాత్మకంగా మారుతున్నాయి. ఆదివారం జరిపిన దుండగుల దాడిలో ఖొయిజుమన్ తాబి గ్రామానికి చెందిన ముగ్గురు గ్రామ వ్యాలెంటీర్లు మరణించారు.
Violence continues in Manipur. Three killed in thug attack
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో (Manipur) గత కొంత కాలంగా అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే. దాదాపు వారం రోజులుగా ఆందోళనలు జరుగుతున్నా ఏ మాత్రం సద్దుమనగకపోగా ఇంఫాల్ లోయలో మరోసారి హింస చెలరేగింది. బిష్ణుపూర్ (Bishnupur) జిల్లాలోని ఖొయిజుమన్ తాబి (Khoijumantabi) అనే గ్రామంపై గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. అల్లర్ల కారణంగా గ్రామస్తులు ముందుస్తుగా ఏర్పాటు చేసుకున్న బంకర్లపై (Bunker) దాడి చేశారు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని కొండలపై నుంచి వచ్చిన ముకలు గ్రామంపై దాడి చేశారని.. ఈ దాడిలో ముగ్గురు గ్రామ వాలంటీర్లు (Village volunteers) తీవ్రంగా గాయపడి మరణించినట్లు పోలీసులు తెలిపారు.
ఖొయిజుమన్ తాబి(Khoijumantabi) గ్రామంలో అల్లర్లు జరుగుతున్న సమాచరం మేరకు తాము ఘటనా స్థలానికి చేరుకునే సరికి దుండగులు అక్కడినుంచి పారిపోయారని, ఆ సమయంలో గ్రామస్తులకు దుండగులకు ఎదురుకాల్పులు జరిగాయని వెల్లడించారు. అలాగే శనివారం రాత్రి జరిగిన కాల్పుల్లో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. రెండు నెలల క్రితం మూసివేసిన 2వ నంబర్ జాతీయ రహదారిని కుకీ (Kuki) తెగలు తిరిగి తెరిచాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా విజ్ఞప్తి మేరకు కంగ్పోక్పీ (Kangpokpi) జిల్లాలోని జాతీయ రహదారి (National Highway) ని తెరిచినట్లు కూకీ తెగలకు చెందిన యునైటెడ్ పీపుల్స్ ఫ్రంట్ (UPF), కుకీ నేషనల్ ఆర్గనైజేషన్ (KNO) వెల్లడించాయి. అయితే మణిపూర్లో రెండు జాతీయ రహదారులు ఉన్నాయి. ఇంఫాల్ నుంచి దిమాపూర్ వరకు ఎన్హెచ్-2, ఇంఫాల్ నుంచి జిరిబామ్ వరకు ఎన్హెచ్ 37 ఉన్నాయి. రాష్ట్రంలో అల్లర్లు ప్రారంభమైనప్పటి నుంచి ఈ రెండు హైవేలను కుకీ తెగ నిరసనకారులు మూసివేశారు.
బుధవారం నుంచి కొనసాగుతున్న ఈ అల్లర్లలో దాదాపు 31 మంది మృతి చెందారని స్థానికులు చెప్తున్నారు. కానీ ప్రభుత్వం ఈ సంఖ్యను అధికారికంగా ప్రకటించడం లేదు. ఇక మణిపూర్(Manipur) రాష్ట్రంలో ఉన్న ప్రధాన తెగలు కుకీ(kuki), నాగ(Naga), మైతీ(Maithi) తెగల మధ్య రిజర్వేషన్ల విషయంలో వచ్చిన వివాదం ఒక్కటే ఈ అల్లర్లకు కారణం కాదని ఎప్పటినుంచో ఆ ప్రాంతవాసులలో అనేక విషయాల్లో అసంతృప్తి ఉందని తెలుస్తుంది. ఈ అల్లర్లు ఎప్పుడు సద్దుమనుగుతాయో చూడాలి మరి.