SRPT: మోతే మండలం తుమ్మలపల్లి గ్రామం నుంచి నడిగూడెం మండలం కేశవాపురం వెళ్లే ప్రధాన రహదారి మట్టి రోడ్డుతో ప్రజలు, రైతులు ప్రతిరోజు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం రాకపోకలకు ఈ మార్గాన్ని ఉపయోగించి వారికి ప్రయాణం కష్టంగా మారిందని స్థానికులు తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి ఈ రహదారికి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.