నంద్యాల: జిల్లా బేతంచర్ల మండలంలోని ఆర్ఎస్ రంగాపురం గ్రామంలో బోయ శ్రీకాంత్ (35) అనే వ్యక్తి శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కడుపునొప్పి తీవ్రంగా ఉండటంతో బాధను తట్టుకోలేక అత్తారింట్లో ఉరేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.