TG: కేవలం పేదల ఇళ్లు కూల్చటం గురించి మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తోందని మాజీమంత్రి హరీష్ రావు ఆరోపించారు. ‘డబ్బులు లేవంటున్న సర్కార్ రూ.1.50 లక్షల కోట్లతో మూసీ సుందరీకరణ అంటోంది. రైతులకు పెట్టుబడి సాయానికి, ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేందుకు డబ్బులు లేవంటున్నారు. ఈ ప్రభుత్వం ప్రాధాన్యతలో రైతులు, పేదలు, మహిళలు, విద్యార్థులు లేరు’ అని మండిపడ్డారు.