WGL: నర్సంపేట మున్సిపల్ పరిధిలోని మాదన్నపేట గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తగిలి 10 సంవత్సరాల బాలుడు శివకోటి శుక్రవారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.