2010లో ఫోక్ సింగర్ సాయిచంద్(Saichand)కు గుండెపోటు మొదటిసారి వచ్చిందని ప్రజాగాయని విమలక్క (Vimalakka) అన్నారు. ఖమ్మంలో ఓ మీటింగ్ లో పాల్గొన్న సమయంలో హార్ట్ స్ట్రోక్(Heart stroke)కు గురయ్యారని ఆమె తెలిపారు. సాయిచంద్ లాంటి గొప్పగాయకుడిని తెలంగాణ సమాజం కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గొప్పనాయకుడిగా ఎదిగే క్రమంలో సాయిచంద్ మృతిచెందడం బాధాకమరని అరుణోదయ టీమ్ లో సాయిచంద్ సహకరించిన తీరును విమలక్క గుర్తు చేసుకున్నారు. తన ఆరోగ్యం గురించి సాయిచంద్ కేర్ తీసుకున్నారని ఆమె చెప్పారు. చిన్నవయసులోనే సాయిచంద్ ఈ లోకాన్ని విడిచివెళ్లడం బాధాకరం అని అన్నారు. తెలంగాణ (Telangana) మలిదశ ఉద్యమంలో సాయిచంద్ తో కలిసి కార్యక్రమాలలో పాల్గొన్న సంధర్బాన్ని గుర్తుచేసుకున్నారు.
రాజకీయప్రముఖులు, ఉద్యమకారులు సాయిచంద్ కు నివాళులు అర్పించేందుకు ఆయన ఇంటికి చేరకుంటున్నారు.సాయిచంద్ తో కలిసి ఎన్నో పాటలు పాడానని విమలక్క తెలిపారు. నేడు సాయిచంద్ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిన ఆ పాట కోట్ల మందిని కదిలించింది. జానపదాన్ని (folklore) నింపుకుని జనం గొంతుకై నిలిచిన పాట ఊరూవాడా ప్రతిధ్వనించింది. సొంతంగా రాసి.. బాణీకట్టి.. గజ్జెకట్టి ఆడుతుంటే యావత్ తెలంగాణ ఉద్వేగంతో ఊగిపోయింది. ఉద్యమ సమయంలో కీలక పోషించిన కళాకారులు చాలా మందే ఉన్నా.. సాయిచంద్ తీరు చాలా ప్రత్యేకం అనే చెప్పాలి. అందుకే ఆయన మరణవార్త తెలంగాణ సమాజాన్ని కలిచివేస్తోంది. కళాకారుల హృదయాలన్నీ బరువెక్కిపోయాయి. బీఆర్ఎస్ పార్టీ (BRS PARTY) తో సాయిచంద్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. అందుకే.. ఆయన మరణ వార్త తెలియగానే పార్టీ ముఖ్యనేతలంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆస్పత్రికి వచ్చి నివాళులు అర్పించారు.