TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో రాహుల్ వైఖరిని ప్రశ్నిస్తూ లేఖలో నిలదీశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడతామని మేనిఫెస్టోలో చెప్పారని.. రాహుల్ రాజ్యాంగం చేతబట్టి దేశవ్యాప్తంగా నీతిసూత్రాలు చెప్పారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ రక్షించడమంటే ఇదేనా? అని విమర్శించారు.