T20 WC ఫైనల్ ముందు భారత జట్టు తమ హోటల్ మార్చిందన్న వార్తలు నిజమేనని కెప్టెన్ సూర్య స్పష్టంచేశాడు. సెమీస్ కోసం ముంబై వెళ్తుండగా.. అహ్మదాబాద్ హోటల్‌ను మార్చాలని, గతంలో చాలా టీమ్స్ ఇలా చేశాయని ఎవరో సూచించారన్నాడు. కప్ కోసం ఏ చిన్న ఛాన్స్ వదులుకోకూడదని అంతా సరే అనుకున్నట్లు పేర్కొన్నాడు. 2023 WC ఫైనల్ ఓటమితో భారత్ కప్ గెలవదన్న చోటే గెలిచి చూపించడం బాగుందన్నాడు.