దర్శకుడు బోయపాటి శ్రీను తన యాక్షన్ సినిమాల ఫ్రాంచైజీలను ముందుకు తీసుకెళ్లే పనిలో ఉన్నాడు. ‘అఖండ 2’తో మంచి రెస్పాన్స్ అందుకున్నాడు. తాజాగా సన్నీ డియోల్ సినిమా ‘జాట్ 2’ను డైరెక్ట్ చేసేందుకు బోయపాటిని సంప్రదిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇందుకోసం భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం. దర్శకుడు గోపిచంద్ మలినేని తెరకెక్కించిన ‘జాట్’ మూవీకి సీక్వెల్గా రానుంది.