MDK: సర్వైకల్ క్యాన్సర్ నివారణకు HPV వ్యాక్సిన్ ఎంతో ఉపయోగపడుతుందని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మెదక్ జనరల్ ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆమె నిన్న ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని 15 ఏళ్లలోపు బాలికలందరికీ జనరల్, ఏరియా ఆసుపత్రుల్లో ఈ టీకాను ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించారు.