BDK: బూర్గంపాడు మండలం సారపాక గ్రామం ఎస్టీ కాలనికి చెందిన ఆరు నెలల గర్భిణి భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. గ్రామంలో అంగన్వాడీ కేంద్రం మౌలిక సదుపాయాలు లేకపోవడంతో గర్భిణులకు సరైన పోషకాహారం ఆరోగ్య అవగాహన అందడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను గుర్తించి అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.