Akira Nandan: అకీరా నందన్ హీరోగా రెడీ.. రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
పవన్ వారసుడు అకిరా నందన్ హీరోగా ఎంట్రీ ఇస్తే.. ఓ రేంజ్లో వెల్కమ్ చెప్పాలని కలలు కంటున్నారు మెగాభిమానులు. కానీ పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ మాత్రం.. అకీరా నందన్ హీరో ఎంట్రీ గురించి క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే అకీరా నందన్ లేటెస్ట్ వీడియో చూసిన తర్వాత.. హీరోగా రెడీ అవుతున్నాడని మురిసిపోతున్నారు ఫ్యాన్స్. తాజాగా రేణు దేశాయ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కమిట్ అయినా సినిమాలను కంప్లీట్ చేసి.. పూర్తిగా పొలిటికల్ పైనే ఫోకస్ చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో పవన్‌కు జనం జేజేలు కొడితే.. సినిమాలకు గుడ్ బై చెప్పేసిసినట్టే. ఇక పై జనంలోనే ఉండబోతున్నాడు పవర్ స్టార్. అందుకే ఆయన లోటుని పూడ్చేందుకు.. వారసుడు అకీరా నందన్(Akira Nandan) హీరోగా ఎంట్రీ ఇవ్వాలని అంటున్నారు అభిమానులు. సమయం వచ్చినప్పుడల్లా అకిరా నందన్ హీరోగా ఎంట్రీ ఇవ్వాలని అడుగుతునే ఉన్నారు. కానీ అకీరా హీరో అవుతాడా? లేదా? అనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు. అయితే అకీరా మాత్రం.. హీరో అయ్యేందుకు ఏమెం కావాలో.. అన్ని చేస్తున్నాడు.
గతంలో అకిరా(Akira Nandan) పియానో వాయించిన వీడియోలు.. మార్షల్ ఆర్ట్స్ వీడియోలు చూసి మల్టీ టాలెంటెడ్ అని మురిసిపోయారు అభిమానులు. ఇక ఇప్పుడు వర్కౌట్ వీడియో చూసి.. ఖచ్చితంగా అకిరా హీరో అని ఫిక్స్ అయిపోయారు. పవన్‌తో విడాకులు తీసుకున్న తర్వాత.. రేణు దేశాయ్ దగ్గరే ఉంటున్నారు అకీరా నందన్, ఆద్య. అప్పటి నుంచి అకీరాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ అయినా రేణు దేశాయ్‌నే షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా అకీరా నందన్ వర్కౌట్ వీడియో చేయగా.. వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియోతో పాటు ఆసక్తికర కామెంట్స్ చేసింది.
‘అకీరా జిమ్ చేస్తూ తెలుగు, హిందీ మ్యూజిక్ వింటున్నాడు.. నేను చాలా గర్వంగా ఫీలవుతున్నాను. ఆ అర్థం, పర్థం లేని లౌడ్ ఇంగ్లీష్ మ్యూజిక్ కాకుండా సొంత భాషల మ్యూజిక్ వినడం గొప్ప విషయం. మన మ్యూజిక్ వినడం గొప్ప అనుభూతిని ఇస్తుంది. జిమ్ సెంటర్ల నిర్వాహకులకు నేనొక్కటే కోరుతున్నా.. ఇక్కడ ఇంగ్లీష్ పాటలకు బదులుగా మాతృభాషలోని పాటలు పెట్టడం ద్వారా మనసుకు ఉల్లాసాన్ని ఇస్తాయి’ అని రాసుకొచ్చింది. ఇదిలా ఉంటే.. అకీరా కటౌట్ చూసి హీరోగా రెడీ అవుతున్నాడని మురిసిపోతున్నారు అభిమానులు. త్వరలోనే అకీరా(Akira Nandan) ఎంట్రీ ఉంటుందని అంటున్నారు.