SDPT: టెన్త్ పరీక్షల నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలోని పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 అమల్లో ఉంటుందని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 500 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడడం నిషేధమన్నారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ప్రతి పరీక్షా రోజూ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని వెల్లడించారు.