AKP: మునగపాక మండలం నారాయణపాలెంలో గ్రామ దేవత మరిడిమాంబ అమ్మవారి పండగను గురువారం ఘనంగా నిర్వహించారు. భక్తుల పలువురు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించి పసుపు కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలకుండా ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.