NLG: చెరువుగట్టు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం నిర్వహించిన వివిధ వేలం పాటలు గుడికి రికార్డు స్థాయి ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. మొత్తం ఐదు విభాగాల్లో నిర్వహించిన ఈ టెండర్ల ద్వారా దేవస్థానానికి రూ.50,22,887 ఆదాయం సమకూరినట్లు EO సల్వాది మోహన్ బాబు తెలిపారు. గతేడాదితో పోల్చితే ఈసారి వేలం పాటల్లో గణనీయమైన పెరుగుదల కనిపించింది.