అనంతపురం జిల్లాలో చీనీ ధరలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ టమాటా ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. అనంతపురం మార్కెట్ యార్డులో చీనీ కాయలు టన్ను గరిష్ట ధర రూ.22,000, కనిష్ట ధర రూ.8 వేలు పలికింది. కక్కలపల్లి మార్కెట్ యార్డులో కిలో టమాటా ధర రూ.6, కనిష్ట ధర రూ.3, ప్రకారం క్రయవిక్రయాలు జరిగాయి. దీంతో టమాటా పండించిన రైతులు ధరల తగ్గింపుతో వాపోతున్నారు.