KMR: జిల్లాలోని 2024-25 విద్యా సంవత్సరానికి ఎస్సీ విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు విడుదల చేసినట్లు జిల్లా షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ అధికారి వెంకటేష్ తెలిపారు. మొత్తం 2,068 మంది విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసినట్లు చెప్పారు. కేంద్రం వాటా రూ.90.36 లక్షలు, రాష్ట్రం వాటా రూ.89.62 లక్షలు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.