AP: రాష్ట్రంలో ఆతిథ్యరంగానికి పెద్దఎత్తున అవకాశాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఆతిథ్య రంగానికి అవకాశాలు ఉన్నందున 50 వేల హోటల్ గదులు సిద్దం కావాలన్నారు. ఏమీ లేని ప్రాంతాల్లోనే కొన్ని దేశాల్లో టూరిజం అభివృద్ధి చేస్తున్నారని, ఏపీలో అనేక చరిత్రాత్మక ప్రాంతాలు ఉన్నందున దృష్టి పెట్టాలన్నారు. యుద్ధ ప్రభావాల దృష్ట్యా.. విదేశాల కంటే స్థానికంగానే పర్యాటకానికి ఆకర్శించాలన్నారు.