BHPL: టేకుమట్ల మండల పోలీస్ స్టేషన్ ఎస్సైగా అమూల్య బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలో అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజలతో స్నేహపూర్వక ఉంటానన్నారు.