ELR: ద్వారకాతిరుమల క్షేత్రంలో హుండీ లెక్కింపులో ఓ సేవకుడు తన చేతివాటం ప్రదర్శించి దొరికిపోయాడు. ఇరగవరం మండలం సూరంపూడికి చెందిన సురేశ్ హుండీ లెక్కింపులో 59.700 గ్రాముల బంగారం, 4 డాలర్లను దుస్తుల్లో దాచుకుని తప్పించుకోబోయాడు. తోటి సేవకుడికి అనుమానం వచ్చి సెక్యూరిటీకి సమాచారం ఇవ్వడంతో నిందితుడు పట్టుబడ్డాడు.