VZM: గంట్యాడ మండలంలో నిర్వహిస్తున్న ఆధార్ ప్రత్యేక క్యాంపులను వినియోగించుకోవాలని MPDO ఆర్వీ రమణమూర్తి సూచించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. మండలంలో మొదటి విడతగా మార్చి 9 నుంచి 13వ తేది వరకు, రెండో విడతగా మార్చి 23 నుంచి 26 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కొటారుబిల్లి గ్రామ సచివాలయంలో ఆధార్ స్పెషల్ క్యాంప్ జరుగుతున్నట్లు పేర్కొన్నారు.