TPT: తిరుపతిలో గరుడ వారధిపై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ సుబ్బరాయుడు, మున్సిపల్ కమిషనర్ మౌర్యల సమీక్ష అనంతరం ఇకపై వారధిపై ద్విచక్ర వాహనాలు, భారీ ట్రాన్స్పోర్ట్ వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. ప్రజల భద్రత దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ పాటించాలన్నారు.