తెలంగాణ (Telangana) ప్రభుత్వం విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పింది.ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా 17 గురుకుల డిగ్రీ కాలేజీల(Degree colleges)ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్(CMKCR) కు మంత్రి గంగుల కమలాకర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఒక ప్రకటనలో వెనుకబడిన వర్గాలకు శుభాకాంక్షలు చెప్పారు. డిగ్రీ కాలేజీలకు త్వరలోనే పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేస్తూ ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతుల ప్రారంభానికి సీఎం కేసీఆర్, బీసీ సంక్షేమశాఖ మంత్రి ఆదేశాలతో అన్ని చర్యలు తీసుకుంటామని బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశ్(Burra Venkatesh) వెల్లడించారు. డిగ్రీ కాలేజీలకు త్వరలోనే పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేస్తూ ఈ విద్యా సంవత్సరం నుండే తరగతుల ప్రారంభానికి అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
గతంలో వర్గల్ కాలేజీ(Vargal College)కి అదనంగా 2022-23 విద్యా సంవత్సరంలో నూతనంగా 15 గురుకుల డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసుకొని క్లాసులను ప్రారంభించుకున్నామని, ఇందులో రెండు వ్యవసాయ డిగ్రీ కాలేజీలు ఉన్నాయని తెలిపారు.తాజాగా జిల్లాకు ఒక డిగ్రీ కాలేజీకి సీఎం అనుమతినిస్తూ మరో 17 డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేయడం బీసీలకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యం వైపు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయడానికి నిదర్శనం అన్నారు. గత విద్యా సంవత్సరంలో నూతనంగా ఏర్పాటైన జిల్లాల్లో 33 కొత్త గురుకులాలను కూడా ప్రారంభించినట్లు చెప్పారు.కేసీఆర్ ప్రభుత్వం సకల హంగులతో, ప్రపంచస్థాయి నాణ్యతా ప్రమాణాలతో గురుకులాలను దశలవారీగా 327కి పెంచిందన్నారు. బీసీ గురుకులాల్లో ప్రతీ ఏడు ఇంగ్లిష్ మీడియం (English medium) లో చదివిన 1,68,000 పైచీలుకు వెనుకబడిన వర్గాల బిడ్డలు నేడు అన్ని పోటీపరీక్షల్లోనూ తమ సత్తా చాటుతూ తెలంగాణ కీర్తి పతాకను వినువీధుల్లో ఎగిరేయడం సంతోషంగా ఉందన్నారు.
చదవండి :Vijaya Yatra : వారాహి యాత్రకు పేరు ఖరారు చేసిన పవన్