Hit tv exclusive interview with music director Charan Crjun
Charan Crjun: ఇటీవల విడుదలైన విమానం మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో మ్యూజిక్ బాగుందని ప్రేక్షకులు అంటున్నారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ సూపర్ బాగున్నాయని అభిప్రాయ పడుతున్నారు. ఆ మూవీ సంగీత దర్శకుడు చరణ్ అర్జున్‌తో (charan arjun) హిట్ టీవీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ చేసింది. ఆ మూవీలో అవకాశం రావడం.. కెరీర్ గురించి వివరించారు. అంతకుముందు చిన్ని చరణ్ పేరు ఉండేదని.. దానిని చరణ్ అర్జున్‌గా మార్చుకున్నానని తెలిపారు.
చిన్న చరణ్ పేరుతో చేసిన సినిమాలు కూడా మంచి పేరు తీసుకురాలేదని తెలిపారు. తర్వాత యూట్యూబ్ చానెల్ పెట్టి, ప్రైవేట్ ఆల్బమ్ చేశానని వివరించారు. విమానం మూవీలో పాట రాసే అవకాశం వచ్చిందని.. రాయనని చెప్పారని చెప్పారు. ఆ సమయంలో తన తమ్ముడు చనిపోయి ఐదు రోజులు అయ్యిందని.. బాధలో ఉన్నానని గుర్తుచేశారు. ఓ స్నేహితుడి కోసం రాయాల్సి వచ్చిందని.. విచిత్రంగా ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ మారారని పేర్కొన్నారు. పాట రాసి కంపోజ్ చేయమని కోరితే.. తననే ఎందుకు మ్యూజిక్ చేయాలని అడగొద్దని చెప్పానని గుర్తుచేశారు. ఓ రీల్ చేయమంటే 3 రోజుల్లో పూర్తి చేశానని తెలిపారు. అదీ నచ్చి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యానని గుర్తుచేశారు.
మూవీలో నాన్న పాటకు మంచి పేరొచ్చింది. ఎమోషన్ ఎక్కువ ఉందన్నారు. మూవీ చూసి నటుడు సముద్రఖని ఫోన్ చేశారని.. మ్యూజిక్ డైరెక్టర్ అంటే అదీ.. చూసుకుంటా అన్నారని గుర్తుచేశారు. తన భార్యతో కూడా ఫోన్లో మాట్లాడాడని పేర్కొన్నారు. ఇక నుంచి ఇల్లు, పిల్లలను చూసుకో.. తనని నేను చూసుకుంటానని చెప్పారని వివరించారు. తనను ఎవరూ అలా అనలేదని గుర్తుచేశారు. డైరెక్టర్ శివప్రసాద్ వల్లే తనకీ ఈ గుర్తింపు వచ్చిందని.. ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.