కృష్ణా: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలందరికీ చేరేలా చర్యలు తీసుకోవాలని CM చంద్రబాబు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అమరావతిలోని సచివాలయం నుంచి నిర్వహించిన 6వ కలెక్టర్ల సదస్సులో స్వర్ణాంధ్ర–2047 విజన్, స్వచ్ఛాంధ్ర, GSTP లక్ష్యాలపై సమీక్షించారు. మచిలీపట్నం కలెక్టరేట్ నుంచి JC ఎం.నవీన్ సహా అధికారులు పాల్గొన్నారు.