NRPT: నర్వ మండలం ఉండేకోడ్ గ్రామానికి చెందిన అడ్వకేట్ పసుల నీరజ్ TAC బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు కాట్రగడ్డ విజయ్ హైదరాబాద్లో ఇవాళ జరిగిన భేటీలో ఆయనను అభినందించారు. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయడం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బలాన్ని పెంచేందుకు కృషి చేయాలని సూచించారు.