ఒకే ఒక్క సినిమాతో తెలుగు కుర్రకారును తెగ అట్రాక్ట్ చేసింది యంగ్ బ్యూటీ శ్రీలీల. పెళ్లి సందడి సినిమాలో శ్రీలీలను చూసి.. ఈ బ్యూటీ ఖచ్చితంగా స్టార్ హీరోయిన్ స్థాయికెళ్తుందని అనుకున్నారు. అనుకున్నట్టే రెండో సినిమాతోనే మాస్ మహారాజాతో ఛాన్స్ అందుకుంది.. అయితే ఫస్ట్ సినిమా హిట్ అయినంత మాత్రాన స్టార్డమ్ అందుకుంటుందని ఖచ్చితంగా చెప్పలేం. దాంతో ధమాకా సినిమా రిజల్ట్.. శ్రీలీలకు ఎంతో కీలకంగా మారింది. అనుకున్నట్టే.. ఇప్పుడు శ్రీలీల టైం స్టార్ట్ అయిపోయిందని చెప్పొచ్చు. స్టార్ హీరోతో ఛాన్స్ వచ్చింది కదా అని.. ఎక్కడా కూడా ఆటిట్యూడ్ చూపించలేదు అమ్మడు. పైగా తనదైన స్టైల్లో ప్రమోషన్స్ చేస్తూ ధమాకాపై మరింత హైప్ తీసుకొచ్చింది. డిసెంబర్ 23న థియేటర్లోకొచ్చిన ధమాకా మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే మాస్ రాజా ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ గురించి కొత్తగా చెప్పెదేం లేకపోయినా.. శ్రీలీల గురించి మాత్రం సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. అమ్మడి గ్లామర్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిందని అంటున్నారు. ముఖ్యంగా డ్యాన్స్ పరంగా శ్రీలీల కుమ్మేసిందని అంటున్నారు. మాస్ రాజాతో పర్ఫెక్ట్ పెయిర్ అనిపించుకుంది. ఆన్స్కీన్లో ఈ ఇద్దరి కెమిస్ట్రీ బాగుందని అంటున్నారు. దాంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది శ్రీలీల. రవితేజ చెప్పినట్టుగానే.. మరో నాలుగైదేళ్లు శ్రీలీల టాలీవుడ్‌ను ఏలడం ఖాయమంటున్నారు. ప్రస్తుతం తెలుగులో నవీన్ పోలిశెట్టి సరసన ‘అనగనగా ఒక రాజు’, నితిన్‌తో ‘జూనియర్’ అనే సినిమాలు చేస్తోంది. అలాగే బాలయ్య-అనిల్ రావిపూడి ప్రాజెక్ట్.. బోయపాటి-రామ్ కాంబోలో వస్తున్న సినిమాతో పాటు ఇంకొన్ని సినిమాల్లో నటిస్తోంది. ఏదేమైనా శ్రీలీలకు మంచి కమర్షియల్ హిట్ పడినట్టేనని చెప్పొచ్చు.