TG: పార్టీ ఫిరాయింపు MLAలపై అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం అసెంబ్లీ చరిత్రలో బ్లాక్ డేగా మిగిలిపోతుందని మాజీమంత్రి రాజయ్య విమర్శించారు. CM రేవంత్ రెడ్డి రాసి ఇచ్చిన స్క్రిప్ట్‌ను మాత్రమే స్పీకర్ చదివారని విమర్శించారు. కడియం శ్రీహరికి నిజంగా నైతిక విలువలు ఉంటే BRS కండువా కప్పుకుని స్టేషన్ ఘనపూర్‌లో అడుగు పెట్టాలని రాజయ్య సవాల్ విసిరారు.