హీరో శివ కార్తికేయన్ తన భార్య ఆర్తిపై ప్రశంసలు కురిపించాడు. తాను నిర్మించిన కొత్త సినిమా ‘తాయి కిళవి’ సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. ‘నా ఆర్థిక లావాదేవీలన్నీ ఆర్తినే చూసుకుంటుంది. చివరికి సినిమా టికెట్టు కొనాలన్నా ఆమెనే డబ్బులు అడుగుతాను’ అని సరదాగా వ్యాఖ్యానించాడు. ఆమె క్రమశిక్షణ పట్ల తాను ఎంతో గర్వపడుతున్నానని, తన విజయాల్లో ఆమె పాత్ర కీలకమని పేర్కొన్నాడు.