»Nbk 109 Balayya Gave A Surprise On His Birthday The Movie Started Under The Direction Of Bobby
NBK 109: బర్త్ డే రోజు సర్ప్రైజ్ ఇచ్చిన బాలయ్య..బాబీ దర్శకత్వంలో సినిమా స్టార్ట్
బాలయ్య బర్త్ డే సందర్భంగా మరో కొత్త సినిమాను ప్రారంభించారు. NBK 109 వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కనుంది. డైరెక్టర్ బాబీ ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు.
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) పుట్టినరోజు(Birth Day) సందర్భంగా మరో సినిమాను ప్రారంభించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఆ సినిమాను నిర్మించనున్నాయి. బ్లాక్ బస్టర్ సినిమాల డైరెక్టర్ బాబీ(Director Bobby) ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. శనివారం పూజా కార్యక్రమాలను నిర్వహించిన తర్వాత ఈ మూవీని అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించింది.
మొదట దర్శకుడు వివి వినాయక్(VV Vinayak) చేతుల మీదుగా స్క్రిప్ట్‌ను మూవీ యూనిట్‌కు అందించారు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Director Gopichand Malineni) కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) మొదటి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్(Poster release) చేశారు. పోస్టర్లో మద్యం సీసా, గొడ్డలి, ఇతర పదునైన ఆయుధాలు ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తే ఇందులో బాలయ్య(Balayya) క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్‌గా ఉంటుందో అర్థమవుతోంది.
‘వయోలెన్స్ కా విజిటింగ్ కార్డ్’ అనే లైన్‌తో ఈ మూవీ(NBK 109) ఉంటుందని పోస్టర్లో తెలిపారు. ప్రపంచానికి అతను తెలుసు.. కానీ అతని ప్రపంచం ఎవరికీ తెలియదు అంటూ పోస్టర్(Poster)పై బలమైన ట్యాగ్ లైన్ ఉంది. ఈ రెండు లైన్స్‌తో సినిమా(Movie)పై భారీ అంచనాలు పెరిగాయి. 2024లో ప్రారంభంలో ఈ మూవీని విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.