మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej), లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) ఇద్దరూ లవ్ చేసుకొని జూన్ 9న నిశ్చితార్థం(Engagement) చేసుకున్నారు. వరుణ్ – లావణ్య నిశ్చితార్థం హైదరాబాద్ (Hyderabad) లోని వరుణ్ తేజ్ ఇంట్లోనే నిన్న శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ ఎంగేజ్మెంట్ చాలా సింపుల్ గా కేవలం మెగా, అల్లు ఫ్యామిలీలు, లావణ్య ఫ్యామిలీలు, అత్యంత సన్నిహితుల మధ్య మాత్రమే జరిగింది. అయితే ఈ ఎంగేజ్మెంట్లో లావణ్య త్రిపాఠి కట్టుకున్న చీర అందరినీ ఆకర్షించింది. సాధారణంగానే సెలబ్రెటీస్ వేసుకునే బట్టలు చాలా కాస్ట్లీగా ఉంటాయి. స్పెషల్‌గా డిజైన్ (Special design) చేసిన బట్టలనే వేసుకుంటారు చాలా మంది. ఇక ఏదైనా ఫంక్షన్ లేదా ఈవెంట్ ఉంటే వాళ్లు వేసుకునే బట్టల ధర లక్షలు.. అప్పుడప్పుడూ కోట్లలో కూడా ఉంటుంది.
ఇప్పుడు లావణ్య కట్టుకున్న చీర గురించి కూడా అలాంటి టాపిక్ మొదలైంది. ఈ ఫంక్షన్లో లావణ్య కట్టుకున్న చీర ధర రూ.75 వేలు. అనితా డోంగ్రె అనే ఫ్యాషన్ డిజైనర్ (Fashion designer) దీన్ని డిజైన్ చేశారు. ఆమె ఫొటోలను ఆమె తన ఇన్స్టాగ్రాం(Instagram)లో కూడా పోస్ట్ చేశారు. అకేషన్‌కు తగ్గట్టుగా చాలా సింపుల్‌గానే ఉన్నా.. అందరినీ చాలా అట్రాక్ట్ చేసింది ఈ శారీ. లైట్ గ్రీన్ కలర్(Light green color) లో ఉన్న ఈ పట్టు చీర మెరిసిపోతుండగా లావణ్య ఇందులో మరింత అందంగా కనిపించింది.అయితే చాలా మంది హీరోయిన్స్ పెళ్లి చీరల ధరతో పోలిస్తే ఇది తక్కువే అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. నిశ్చితార్థానికి 75 వేల రూపాయల చీర కట్టింది అంటే పెళ్ళికి కచ్చితంగా లక్ష రూపాయలు దాటుతుంది అని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.