WGL: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం–అధికారులు సమన్వయంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం 51వ డివిజన్లో రూ.1.17 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు, డ్రైనేజీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.