MHBD: మరిపెడ మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రంలో బుధవారం చిన్నారులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రనాయక్ హాజరై అంగన్వాడి పిల్లలకు దుస్తులను పంపిణీ చేశారు. MLA మాట్లాడుతూ.. చిన్నారుల ఆరోగ్యం, పోషణ, విద్య వంటి అంశాలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో తీసుకుంటుందన్నారు.