»Massively Increasing Bp And Sugar Victims Is That The Reason
The Lancet Report: భారీగా పెరుగుతోన్న బీపీ, షుగర్ బాధితులు..కారణం అదేనా?
గతంలో కంటే ఇప్పుడు మధుమేహం బారిన పడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చాలా రాష్ట్రాల్లో ఆరోగ్య సమస్యలు(Health Problems) ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయని, ఆరోగ్య విధానాల్లో తగిన మార్పు తీసుకురావాలని పరిశోధకులు హెచ్చరించారు.
భారత్‌లో బీపీ, షుగర్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. మధుమేహం బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. ఇండియా జనాభాలో 11.4 శాతం మంది మధుమేహం బారిన పడినట్లు ది లాన్సెట్(The Lancet) డయాబెటిస్ అండ్ ఎండోక్రైనాలజీ జర్నల్ నివేదికలో తేలింది. అదేవిధంగా 35.5 శాతం ప్రజలు రక్తపోటు (Hypertension)తో బాధపడుతున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది.
దేశ వ్యాప్తంగా బీపీ, షుగర్‌తో చాలా మంది బాధపడుతున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) దీనిపై పరిశోధన చేసింది. మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్‌తో కలిసి అధ్యయనం చేయగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. 2008 నుంచి 2020 వరకూ 1.1 లక్షల మందిపై సర్వే చేసి నివేదికను సిద్ధం చేశాయి. ఈ నివేదిక ప్రకారం.. దేశ జనాభాలో 15.3 శాతం ప్రజలు ప్రీ డయాబెటిస్ స్థితికి చేరినట్లు తేలింది.
అలాగే 28.6 శాతం మంది ఊబకాయం, 39.5 శాతం మంది ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు నివేదిక చెబుతోంది. 81.2 శాతం మంది ప్రజల్లో డిస్లిపిడేమియా ఉందని పరిశోధకులు తేల్చారు. గతంలో కంటే ఇప్పుడు మధుమేహం బారిన పడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చాలా రాష్ట్రాల్లో ఆరోగ్య సమస్యలు(Health Problems) ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయని, ఆరోగ్య విధానాల్లో తగిన మార్పు తీసుకురావాలని పరిశోధకులు హెచ్చరించారు.