NLR: కందుకూరు పట్టణంలోని శివారులో దూబగుంట ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో గురువారం ఒక ఆటో బోల్తా పడింది. బొప్పాయి లోడుతో వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి రోడ్డు పక్కకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద సంఘటనలో ఆటో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. బైక్ పై ఉన్నవారు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుని సురక్షితంగా బయటపడ్డారు.