NZB: నవీపేట మండలం మోకన్ పల్లిలో కొనసాగుతున్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించారు. సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. నిర్వహణపరమైన లోపాలను గమనించిన కలెక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.